Wednesday, September 1, 2010

Movie - Kanne Manasu (Ye Divilo Virisina)

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే ||ఏ దివిలొ||

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతినింపెనే ||ఏ దివిలొ||

పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజహంసలా రావే ||ఏ దివిలొ||

నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు అలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే ||ఏ దివిలొ||


http://www.youtube.com/watch?v=EqiBe7EtguM&feature=related



No comments:

Post a Comment