మానస వీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాలా పానుపుపైన అమ్మై నేలా జోకొడుతుంటే
మానస వీణ
పున్నమి నదిలో విహరించాలి పువ్వుల వొళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగి రావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ
వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి
మానస వీణ
మానస వీణ
పొంగే వాగులా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం
ఊహకు నీవే ఊపిరి పోసి చూపవె దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్లి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి
మానస వీణ
మానస వీణ
పొంగే వాగులా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం