మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైనా ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం
ఎందల్లో వెన్నెల్లొ ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా యదే తుమ్మెదై సన్నిధే చేరగా
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం
దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లొ ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని
గులాబిలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేది
సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కొరగా
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
http://www.youtube.com/watch?v=On5Hj4ShhAM
No comments:
Post a Comment