Friday, September 3, 2010

Movie - Sagara Sangamam (Mounamelanoyi)



మౌనమేలనోయి....మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
యదలో వెన్నెల వెలిగే కన్నుల
యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి

పలికే పెదవి వణికింది ఎందుకో
వణికే పెదవి వెనకాల ఏవిటో
కలిసే మనసులా విరిసే వయసులా (2)
నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు
ఏమేమో అడిగినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి

హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా వలపు మడుగులా (2)
కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు
ఎంతెంతొ తెలిసినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
యదలో వెన్నెల వెలిగే కన్నుల
యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి


 http://www.youtube.com/watch?v=dxfcjBY8sEY



No comments:

Post a Comment