Thursday, September 2, 2010

Annamacharya Sankeertanas - Pidikita Talambrala

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి
నవ్వీనె పెండ్లి కూతురు ||

పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||

బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||


http://www.youtube.com/watch?v=0-MZLHnD2SE&feature=related


1 comment:

  1. Please check whether its muthyaala meaDa or muthyala meDa

    ReplyDelete