Wednesday, September 1, 2010

Movie - Sivaranjani (Navaminaati Vennela Nenu)

నవమి నాటి వెన్నెల నేను
దసమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నీ వయసే వసంత ౠతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత ౠతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో ||నవమి నాటి||

నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో ||నవమి నాటి||


http://www.youtube.com/watch?v=UbH6lxFt5Sk


No comments:

Post a Comment