మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
వెచ్చనైన గుండె గిన్నెలో వెన్నలింత దాచి ఉంచకు
పొన్న చెట్టు లేని తోటలో కన్నె వేణువు ఆలపించకు
ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ
పెదవి తాకితే ఓ పాటలే అదీ
ఆమని ప్రేమని పాడే కోయిలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మౌనమైన మాధవీ లత మావి కొమ్మనల్లుకున్నది
ఎల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది
తోచదాయనే ఓ తోడు లేనిదే
కౌగిలింతలే ఓ కావ్యమాయలే
ఎన్నడు లేనిది ఎందుకో ఇలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
http://www.youtube.com/watch?v=M8WCOdjaFEs
No comments:
Post a Comment