Thursday, September 2, 2010

Annamacharya Sankeertanas - Moosina Mutyalakele Moragulu

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

కందులేని మోమున కేలే కస్తూరి

చిందు నీ కొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి

భారపు గుబ్బల కేలే పయ్యెద నీ

బీరపు జూపుల కేలే పెడమోము
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు

ముద్దుల మాటల కేలే ముదములు నీ

యద్దపు జెక్కుల కేలే అరవిరి
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి 


http://www.youtube.com/watch?v=UfvShtBWZEs


No comments:

Post a Comment