Thursday, September 2, 2010

Movie - Megha Sandesham (Aakasa Desana)

Movie: Meghasandesam
Lyricist: devulapalli krishna sastry
Singer: K. J. Yesudas


ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ మేఘమా ….. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం || ఆకాశ దేశాన ||


వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ………..
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం || ఆకాశ దేశాన ||


రాలుపూల తీనియకై రాతిపూల తుమ్మెదనై ………..
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి లేఖల మెరుపులతో రుధిర భాష్ప జల ధారాలతో ఆ ఆ ...ఆ ఆ …
విన్నవించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం || ఆకాశ దేశాన ||


http://www.youtube.com/watch?v=bFmYj30vN5A




No comments:

Post a Comment