Wednesday, September 1, 2010

Movie - Bobillipuli (Janani Janma)

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో ఆతల్లినే కన్నభూమి గొప్పదిరా
||జననీ||

నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా
ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం మరి ఏ రూపాన తీరేను
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా
||జననీ||

గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో
ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం
||జననీ|| 


http://www.youtube.com/watch?v=lhHXEA43J-I



No comments:

Post a Comment