Friday, September 3, 2010

Movie - Marana Mrudangam(Karigi Poyanu)

కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా

మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలి గా

పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలి గా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా

జతలుకలిసి మనమొంటిగా ఏమైనా సరి గ రి సా
ఏ కోరికో శృతే మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా


http://www.youtube.com/watch?v=u0iqZZVKBWA


No comments:

Post a Comment