Thursday, September 2, 2010

Annamacharya Sankeertanas - Naanati Bathuku

నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము...

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము...
నట్టనడిమీ పని నాటకము...
ఎట్టనెదుటి కలదీ ప్రపంచము...
కట్టకడపటిది కైవల్యము...

ఉడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము...
ఒడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము...

తెగదు పాపము, తీరదు పుణ్యము...
నగి నగి కాలము నాటకము...
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనముమీదిది కైవల్యము 


http://www.youtube.com/watch?v=aBxgDwSwfWU&feature=related


No comments:

Post a Comment