Friday, September 3, 2010

Movie - GruhaPravesham (Dari Chupina Devatha)

దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా (2)
జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా

మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో
మమత తెలిసి మనిషినైతి చల్లని నీ చేతిలో
కన్ను తెరిచిన వేళలో నీకేమి సేవను చేతును
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా

మరపు రాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము
కలన కూడ మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము
ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిను దీవించని
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా


http://www.youtube.com/watch?v=zLRXiwbJ_EQ


No comments:

Post a Comment