ఏదో ఆశ ఎదలో
మొదలైనది ఎపుడూ జాడ లేనిది ….
నిజం తెలుసా ఈనాటిది
కాదది ఇపుడే
మేలుకున్నది ….
ఇలా నీ శ్వాస
గిల్లి లెమ్మంటూ
నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా …
నీ లాలిని పాడే
లాలన నేనోయ్
….
జాబిలికై ఆశ పడే
బాలను నేను
…..
తల్లిగా జోకొట్టి చలువే
పంచాలోయ్ ….
చెల్లిగా చేపట్టి చనువే
పంచాలోయ్ ….
సరిగా నాకే ఇంకా
తేలని ఈవేళ
….
నీ నీలి కనుల్లో
వెతుకుతు ఉన్నా ….
క్షణానికో రూపంలో కనబడుతున్నా
….
జాడవై నావెంట నిను
నడిపించాలోయ్ ….
జానకై జన్మంతా జంటగా
నడవాలోయ్ ….
తెలిసీ తెలీనట్టే ఉందీ
ఈ లీల
No comments:
Post a Comment