Sunday, February 13, 2011

Movie - Guna (Priyatamma)

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే


ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఒహో..కమ్మని ఈ ప్రేమలేఖనే
రాసింది హృదయమే(ప్రియతమా)

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.....
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే.....
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది.....
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నది.....
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనది.......


మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా....
ఉమదేవిగా శివుని అర్దభాగమై
నాలోన నిలువుమా.....
శుభలాలి లాలి జో లాలి లాలి జో...
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో....
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా


Kammani ee prema lekhane rasindi hrudayame.....
priyatama neevachata kusalama
nenichata kusalame.........
uuhalanni paatale kanula totalo.....
toli kalala kavitale mata maatalo......
ohoo..kammani ee premalekhane
rasindi hrudayame(priyatama)....

Gundello gayamemo challanga manipoye
maya chese aa maye premaye........
enta gayamaina gani na menikemi gadu
puvvu soki ne soku kandene......
veliki rani verri prema
kanneti dharalona karugutunnadi.......
nadu sokamopaleka
ne gunde badhapadite taalanannadi........
manushulerugaleru mamuulu prema kadu
agni kante swachamainadi........


mamakarame ee lali patagaa
rasedi hrudayama......
umadeviga sivuni ardabhagamai
nalona niluvuma........
subhalali lali jo lali lali jo
umadevi lali jo lali lali jo......
mamakarame ee lali pataga
rasedi hrudayama
na hrudayama......
 


No comments:

Post a Comment