Friday, December 24, 2010

Movie - Siri Vennela (Merise tarala)

మెరిసే తారలదే రూపం.... విరిసే పూవులదే రూపం....
అది నా కంటికి శూన్యం.....
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం......
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతి రూపం......
నీ రూపం..... అపురూపం....

ఎవరి రాకతో గళమున పాటల.. ఏరువాక సాగేనో......
ఆ వసంత మాసపు కులగోత్రాలను ..ఎల కోయిల అడిగేనా......
ఎవరి పిలుపుతో పులకరించి ..పురి విప్పి తనువు ఊగెనో......
ఆ తొలకరి మేఘపు గుణగుణాలకై ..నెమలి వెదుకులాడేనా......

నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతి రూపం......
నీ రూపం..... అపురూపం....

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా.....
గానం పుట్టుక గాత్రం చూడాలా.....
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా.....
గానం పుట్టుక గాత్రం చూడాలా......
వెదురును మురళిగ మలచి.. ఈ వెదురును మురళిగ మలచి......
నాలో జీవన నాదం పలికిన నీవే.......
నా ప్రాణ స్పందన.....
నీకే నా హృదయ నివేదన....

మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం......
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతి రూపం......
నీ రూపం..... అపురూపం....



merise taaralade roopam... virise poovulade roopam......
adi naa kantiki Soonyam.....
manasuna koluvai mamatala nelavai velasina devidi ye roopam.....
naa kannulu choodani roopam gudilo devatha prathi roopam.....
nee roopam apuroopam......
 
yevari raakatho galamuna paatala yeruvaaka saageno.....
aa vasanta maasapu kulagothraalanu yela koyila adigenaa....
yevari piluputho pulakarinchi puri vippi tanuvu vugeno.....
aa tolakari meghapu gunaganaalakai nemali vedukulaadenaa.....

naa kannulu choodani roopam gudilo devatha prathi roopam.....
nee roopam apuroopam......

praanam puttuka praaniki teliyaalaa.....
gaanam puttuka gaathram choodaalaa....
praanam puttuka praaniki teliyaalaa....
gaanam puttuka gaathram choodaalaa...
vedurunu muraliga malachi ee vedurunu muraliga malachi....
naalo jeevana naadam palikina neeve....
naa praana spandana.....
neeke naa hrudaya nivedana....

manasuna koluvai mamatala nelavai velasina devidi ye roopam.....
naa kannulu choodani roopam gudilo devatha prathi roopam.....
nee roopam apuroopam......



http://www.youtube.com/watch?v=uvnXv44Mvgs&feature=fvw

No comments:

Post a Comment